Sunday, April 11, 2010

నాకు చిన్నప్పుడు త్రీ వీలర్(త్రీ సైకిల్) ఉండేది మా వీధిలో అందరికీ టూ వీలర్స్ ఉండేవి(బైసైకిల్).నాక్కూడా అందరి లాంటీ పిపేప్ యే కావాలని చాలా గొడవ చేసేదాన్ని. ఎప్పటినుంచో అదుగుతోందికదా అనుకున్నారేమో మా కాంపౌండ్ దాటి వెళ్ళకూడదు అన్న కండిషన్ మీద కొనుక్కొచ్చారు.దానితో పాటు రిస్ట్ బాండ్స్,ఎల్బౌ పాడ్స్,నీ పాడ్స్,చిన్ గార్డ్ కూడా తెచ్చారు.ఇంతా చేసి అప్పటికి నాకు సైకిల్ తొక్కడం రాదు. నేర్పించటనికి చాలా మంది చాలా ఉబలాటపడ్డారు కాని నేను ఆ గోల్డెన్ చాన్స్ మా అక్కకి ఇద్దామని డిసైడ్ చేసుకున్నా. తాత గారి ఊళ్ళొ నేర్చుకుందురుగాని అని చెప్పి మమ్మల్ని,సైకిల్ని కలిపి ఆ ఊరికి పంపించారు.
ఇంక మా నాయనమ్మ హైరానా స్టార్ట్. ఆవిడలో దాక్కుని ఉన్న పి.టి ఉష ని,తెలంగాణ శకుంతలని బయటకి తీసాం. ఇక మాతో వేగలేక మ పొలంలొ పని చేసే ఒక అమ్మయిని మా కాపలాగ పిలిపించింది.ఆ అమ్మయి పేరు నీలమ్మ.చాలా బాగుండేది.
కాని తన పేరు నాకు నచ్చక నీలిమ అని నేనే పేరు పెట్టను.అందరినీ అలానే పిలవమని పోట్లాడేదాన్ని. నీలిమా వచ్చాక నాయనమ్మ కూడ నాకు గుడ్ గాళ్ లానే కనపడటం మొదలుపెట్టింది.
ఏదో చాలా కొంచెం వచ్చేసింది నాకు సైకిల్ తొక్కటం అని రోజూ తాతాగారి బుర్ర తినేస్తుంటే సరే రేపు సాయంత్రం పంచాయతి ఆఫీస్ నుంచి వచ్చాక చూస్తాను అని చెప్పారు.ఇక్కడ తాతగారి ఇంట్రడక్షన్ ఆయన చనిపోయేదాకా ఆ ఊరికి ఆయనే ప్రెసిడెంట్.తాతగారు వీధిలోకి రాగానే కూర్చుని ఉన్నవాళ్ళందరూ లేచి నిలబడేవాళ్ళు.చాలా రోజులు నాకోసం లేస్తున్నారు అనుకునేదాన్ని. :(
అంతే నా పెర్ఫార్మెన్సెకి అడ్డొస్తాయి అనుకున్న వాటన్నిటినీ ఏదో ఒక మూలకి సర్దించెయ్యమని నీలిమాకి చెప్పను.అసలు నాయనమ్మని కూడ ఎక్కడైనా సర్దించేద్దాం అనుకున్నా కాని తాతగారి మొహం చూసి ఊరుకున్నాను. తాతాగరు వచ్చారు నేను అన్ని రెడీ చేసుకున్నాను. మా పొలంలో పనులు చేసేవాల్లు ఒక 20 మంది దాక వచ్చారు.నేను ఫార్ములా 1 రేసర్లా వాళ్ళందరిని చూసి ఒక స్మైల్ ఇచ్చాను.ఆ తర్వాత సైకిల్ తొక్కటం మొదలుపెట్టాను.కొంచెం సేపు బాగానే తొక్కాను ఆ తర్వాత నా ఎఫిషియన్సీ చూపించటానికి వీధిలోకి వెళ్దాం అనుకున్నా నేను గేట్ దాటి వీధి మలుపు తిరగటం ఎదురుగా గేదె రావాటం ఏదో పొదలోకి సైకిల్+మహి వెళ్ళటం జరిగిపోయింది.నేను లేచి వెనక్కి తిరిగేసరికి తాతగారు కంగారుగా రావటం,నాయనమ్మ గట్టిగా అరవటం,పని వాళ్ళు పరిగెత్తటం ఇలా ఏవేవో కనిపించాయి.
ఎవరో నన్ను బయటకి లాగారు,ఇంకెవరో నా సైకిల్ బయటకి తీసారు.వేరెవరో నన్ను ఇంటికి తీసుకొచ్చారు. (పడిపోయిన బాధలో పోయెట్రి వస్తోంది :( ).
ఏవో చిన్న దెబ్బలు తగిలాయ్.5మిన్స్ అయ్యాక ఒక భయంకరమైన నిజం తెలిసింది అది"నేను పడింది దురదగుంటాకులో"(ఫర్గెట్ మీ నాట్)అంతే ఒళ్ళంతా దురద,దద్దుర్లు.ఇలా నా బాధలో నేనుంటె,ఎవరో ప్రెసిడెంట్ గారి మనవరాలిని కమలమ్మ గేదె పొడించిందంట అని ఎవరికో చెప్పారంట ఇక మొదలయ్యింది జాతర "తిరనాళ్ళాకి వచ్చినట్టు ఒకటే జనం రావటం ఇంటికి నన్ను చూడటనికి.అందరూ రావటం నేను దురదగుంటాకు లో పడ్డానని తెలుసుకుని ఒక చిన్న నవ్వు నవ్వటం.నాకు ఒల్లు మండిపోయింది.
ఇంకొందరు (టీ వీ 9 పూర్వీకులని నా అనుమానం) సంఘటనా స్థలాన్ని అందరికీ చూపించటం. :(
ఆ నెక్స్ట్ డే అమ్మ,నాన్న వచ్చారు.ఎలాగూ సెలవులు అయిపోయాయి కదా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారు.ఇప్పటికి కూడా సైకిల్ అంటే భయమే నాకు.ఎంత ట్రాఫిక్ లో అయినా కార్ డ్రైవ్ చెయ్యగలను కాని ఖాళీ రోడ్ మీద సైకిల్ నడపలేను