Tuesday, March 10, 2009

మట్టి బొమ్మలు

మా ఇంట్లో రోలు దగ్గర ఒక మల్లె పొద ఉండేది.చాలా అంటే చాలా పెద్దది.శెలవలలో సాయత్రం ఆరయ్యాక పెద్దవాళ్ళు పనుల్లో బిజీ గా ఉండేవారు.అలాంటి ఒక రోజు నేను, నా అసిస్టెంట్స్ (మా ఇంటిపక్కన ఉండే నాకన్నా చిన్నపిల్లలు)కలిసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రి (దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు :( ) స్టార్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్నాం.ఇప్పుడు అందరూ బిజినెస్ ప్లాన్స్ అని హడావిడి చేస్తున్నారు కాని అప్పట్లోనే నేను ఎలాంటి హడావిడి లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేసాను.

మల్లె పొద కింద ఉన్న నల్లమట్టి లో నీళ్ళు పోసాం.అప్పటివరకు ఎండకి బాగా ఎండి పోయి వేడెక్కి ఉందేమో మేము నీళ్ళు పోయగానే మట్టి కూడా మల్లె మొగ్గలానే విచ్చుకుంది.లేకపోతే మల్లెపూవుని చూసి నేర్చుకుందేమో మేము మా కార్పెంటర్ని చూసి మట్టితో టేబుల్ చెయ్యటం నేర్చుకున్నట్టు.మల్లెపూల వాసన,తడిసిన మట్టి వాసన అనందంలో పడి మా స్టార్ట్-అప్ కంపెని గురించి కాసేపు మర్చిపోయాం.


చిన్న చిన్న మట్టి ముద్దలు తీసుకుని రోలు ని ప్లాట్ఫార్మ్ లా ఉపయోగించి ఒక టి.వి,బాల్,సోఫా,బొంగరం,చక్రాలు(ఇవి మల్టి పర్పస్ అవసరం అయినప్పుడు ప్లేట్స్ లా కూడ వాడొచ్చు),టేబుల్-మూడు/నాలుగు కాళ్ళు ఉన్నది ఇలాంటి ఇంటికి పనికొచ్చే సామాన్లు చేసాం.కాకపోతే ప్రొడక్షన్ పూర్తి అయ్యేసరికి రోలు కొంచెం మురికిగా తయరయింది.అది చూసి అమ్మ వాళ్ళు మనసు కష్ట పెట్టుకుంటారేమో అని కన్నీళ్ళు కారుస్తున్న నా అసిస్టెంట్స్ కి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుడదు అని ధైర్యం చెప్పాను.అందరం కలిసి అమ్మ వాళ్ళు అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న చోటకి వెళ్ళి మా టాలెంట్ చూపించాం.


నా గురించి,నా తెలివితేటల గురించి బాగా తెలిసినది అవటం వల్లా,నా అంత కాకపోయినా కొద్దో గొప్పో ఇంటెలిజెన్స్ ఉండటం వల్లా,అన్నిటికంటే ముఖ్యంగా మా "అమ్మ" అవటం మూలానా రోలు గురించి తెలిసిపోయింది.అదేంటో నా టాలెంట్ ని గుర్తించటం మానేసి నా వైపు కోపంగా చూడటం మొదలుపెట్టింది. :(

నేనేమైనా తెలివితక్కువదాన్నా భయపడటానికి "అమ్మా,నువ్వు షాపింగ్ కి వెళ్ళటానికి డాడీ కోసం ఎదురు చూడఖ్ఖర్లేకుండ కార్ కూడా చేస్తాను చక్రాలు చేసేసాను ఇంక నిన్న,ఎల్లుండి(నాకు చాలా రోజుల వరకు రేపు-నిన్న,ఎల్లుండి-మొన్న తేడా తెలిసేది కాదు) లోపు సీట్స్ చేసేస్తాను" అన్నాను. పెద్దగా ఏమి పనిచెయ్యలేదు ఈ ట్రిక్ కాని తన్నులు తినకుండా మాత్రం కాపాడింది.


అదేంటో అమ్మ నా టాలెంట్ ని ఎప్పుడూ అర్థం చేసుకునేది కాదు. :( పైగా పనిష్మెంట్ ఇచ్చింది మా పనమ్మాయి ఆ రోలు కడిగేటప్పుడు మగ్ తో నీళ్ళు నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి అని. అలా నా మొదటి కంపెనీ నా ఐడియా సరిగ్గా ఎవరికి అర్థం కాకపోవటం వల్ల ఫెయిల్ అయింది. :(


కాని అదేంటో ఆ తర్వాత అంటే నేను కుంచెం పెద్ద అయ్యక నేనేం చెప్పినా జాగ్రత్తగా వినేది,ఇంక మా నాన్న గారు అయితే నా చిన్న చిన్న అచీవ్మెంట్స్ కి అంటే క్లాస్ లో ఫర్స్ట్ రావటం (లాస్ట్ నుంచి)లాంటి వాటికి కూడా చాలా అనందపడి ఏదో ఒక గిఫ్ట్ కొనేవారు. :)

14 comments:

 1. స్మాల్ స్కేల్ ఇండస్ట్రి = చిన్న తరహా పరిశ్రమలు అనుకుంటా :)

  మొత్తానికి అప్పట్లోనే పరిశ్రమలు ప్రారంభించారు.

  ReplyDelete
 2. చిన్న తరహా పరిశ్రమలు అనే అంటారు :)బావుందండీ!

  ReplyDelete
 3. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ = కుటీర పరిశ్రమ

  ReplyDelete
 4. బావుందండి...నేను కూడా మా అక్కతో కలసి చిన్న చిన్న టేబుల్స్ , పాత్రలు చేసేవాళ్ళం. చిన్న పొయ్యి ఒకటి తయారు చేసి అందులో పరవాన్నం కూడా వండేవాళ్ళం.
  మళ్ళీ నా పాత విషయాలు గుర్తొచ్చాయి.

  ReplyDelete
 5. మీరు మొదలు పెట్టింది కుటీర పరిశ్రమ మహి గారూ.. ప్రొడక్షన్, ప్రొఫిట్స్ లేవు కాబట్టి ఖాయిలా పడ్డ పరిశ్రమ అనాలి :) అమ్మలు పిల్లల్ని అర్ధం చేసుకుంటే ఇండియా ఎప్పుడో అమెరికాని మించిపోయేది.. అక్కడి వాళ్ళే మన దగ్గరికి ఉద్యోగాలకి వచ్చే వాళ్ళు. ఏమంటారు? :):)

  ReplyDelete
 6. అప్పట్లోనే మీరు కుటీర పరిశ్రమ పెట్టారంటే... ఇప్పుడు ఈ వయసులో ఇంకా పెద్ద పరిశ్రమ పెట్టె ఉంటారు.. అదేదో మాకు కూడా చెప్పకూడదూ??

  ReplyDelete
 7. :) మీకు మీ చిన్నప్పటి విషయాలు బాగా గుర్తున్నాయండీ. సింపుల్ గా,చక్కగా నెరేట్ చేశారు. బాగుంది.

  -కార్తీక్

  ReplyDelete
 8. చిన్నప్పుడు నేను కూడా బంకమట్టితో ఒక దీర్ఘచతురస్రాకారపు బ్లాక్ తయారుచేసి, దాని గుండా ముందు వెనక పుల్లలు గుచ్చి , వాటికి బంకమట్టితోటే చేసిన నాలుగు చక్రాలు తగిలించి, దానికో తాడు తగిలించి కారాట ఆడుకొనేవాళ్ళం..వర్షాకాలపు సీజన్లో ఈ హడావిడి ఎక్కువగా ఉండేది..

  చీపురుకట్ట ఉన్నట్లుండి బక్కచిక్కిపోయే సరికి మా అమ్మ చేత తిట్లు కూడా తినేవాళ్ళం.. :(

  బావుంది..

  ReplyDelete
 9. హ హ హ. కూల్.
  రిచ్ డాడ్ పూర్ డాడ్ అని డబ్బు సంపాదన గురింఛి చాలా పేరు పోందిన పుస్తక పరంపర. అందులో మొదటి పుస్తకంలో అతను చిన్నతనంలో మొదలు పెట్టిన కంపెనీ గురించి చెబుతాడు. ఏవిటంటే, మెత్తటి లోహంతో తయారైన టూత్ పేస్టు ట్యూబులు సేకరించి, కరిగించి, అది సెంట్ల నాణే్ల్నీచ్చు వెయ్యడం :)

  ReplyDelete
 10. mi life antha ilage lovely ga funny ga gadicipovalani korukuntu ........

  marinni kaburlato maro post kosam eduru chustuu...

  ReplyDelete
 11. తదుపరి టపా ఎప్పుడండీ, ఇక్కడ ప్రజలు వెయిటింగ్ ;)

  ReplyDelete
 12. నిజమేనండి అంత చిన్న వయస్సు లోనే పరిశ్రమ పెట్టారంటే నిజంగానే చాల తెలివైన వారు.. పాపం మీ అమ్మగారు మీ అంత తెలివైన వారు కాకపోవడం వల్లనేమోనండి ఆవిడకి అంత కోపం వచ్చింది..

  ReplyDelete
 13. మహి గారు
  చాలా చాలా బాగుందండి...
  అన్నట్టు నాకు కూడా చిన్నప్పుడు నిన్న ,రేపు,మొన్న అంటె అస్సలు తేడ తెలిసెడి కాదండి కాని ఆ విషయం ఇప్పుడు ఎవరితో అన్న చెబితే నవ్వుతారేమో అనుకునెవాణ్ణికాని మీరు నాకు ఈ విషయంలో తొదున్నరని తేలిశాక నేను కూడా మీ రుటు కే వచ్చి మీ బ్లొగ్ లొ ఆ విషయంచెప్పేస్తున్న....
  మా శైలి నాకు బాగా నచ్చిందండి ....

  cartheek.....

  ReplyDelete