Monday, March 2, 2009

గోరింటాకు


నా చిన్నప్పుడు వేసవి కాలం శెలవులకి మా కజిన్స్ అందరూ వచ్ఛేవారు.ఇంకో 10డేస్ లో శెలవులు అయిపోతాయి అనగా గోరింటాకు ప్రోగ్రాం ఉండేది.(అంటే స్కూల్ లో అందర్కీ చూపించాలి కదా మరి అందుకు)

పొద్దున్నే అమ్మమ్మ గోరింటాకు కోయించేది.మేము కూడా పనమ్మాయితో కలిసి ఎగబడి మరీ కోసేవాళ్ళం.నేను మాత్రం ఊరికే చెట్టు చుట్టూ,కోస్తున్నవాళ్ళ చుట్టూ ఒక ప్లేట్ పట్టుకుని తిరిగేదాన్ని ఆకులు పట్టుకుంటా అని.(ఇక్కడ నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి,నేను మా ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని,తెలివైనదాన్ని కాబట్టి నన్ను అందరూ చాలా జాగ్రత్తగా చూసేవారు,ఏమి చెయ్యనిచ్చేవారు కాదు)అప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు ప్లేట్లో వేసేవారు.(అంటే ఒక పది ఆకులు అని అర్థం).

నేను ఎంత జాగ్రత్తగా ఆ ఆకులు కోసానో అందరికి చెప్దాం అని పరిగెట్టాను ఆ అకులు అన్నీ గాలికి ఎగిరిపోయాయి.నేను కూడా నా ఏడుపుతో పెంకులు ఎగరకొడదాం అని అనుకుని మొదలుపెట్టేలోపే ఎదురుగా మా మామయ్య వచ్చి "గుండూ బయటకి వెళ్తున్నా వస్తావా?"అని అడిగారు.గెంతుకుంటూ వెళ్ళిపోయాను.

అలా ఒక గంట తిరిగి ఇంటికి రాగానే మా అమ్మ స్నానం చెయ్యకుండా అలా ఊరిమీదపడి ఊరేగొద్దని ఎన్ని సార్లు చెప్పాను అని అడిగింది.నాకు నిజంగా భయంవేసింది నెంబర్ కరెక్ట్గా చెప్పకపోతే ఇంకా తిడుతుండేమో అని,ఈలోపే మా మామయ్య నేనే తీసుకెళ్ళాలే అన్నారు.

మద్యాహ్నం మా జనాలందరి భోజనాలు అయ్యాక మొదలు అయ్యింది గోరింటాకు ప్రోగ్రాం. మా అమ్మ గోరింటాకు పెట్టటం లో ఎక్స్పర్ట్ అందుకే మా అమ్మ చుట్టూ అందరో ఏవో నెంబర్స్ అరుస్తూ తిరుగుతున్నారు. నాకు మా పెద్దమ్మ అన్నం తినిపించేసరికి లేట్ అయ్యింది. అందుకే ఆ నెంబర్స్ కాన్సెప్ట్ ఏంటో అప్పట్లో నాకు అర్థం అవలేదు తర్వాత తెలిసింది అది గోరింటాకు పెట్టించుకోవల్సిన ఆర్డర్ అని.నేను వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాను మా అమ్మేమో "మహీ నీకు ఎప్పుడూ పెడుతూనే ఉంటానుగా (అనటమే కాని ఎప్పుడు పెట్టేది కాదు :( ) ఈసారి అత్తతో పెట్టించుకో గుడ్ గాళ్ వి కదా" అంది . (గుడ్ గాళ్ అంటే చాలు ఎంత కష్టం అయిన పని ,అయినా అంటే కౄష్ణ డాన్స్ చూసి నవ్వకపోవటం లాంటివి కూడా చాలా వీజీగా చేస్తాను అని మా అమ్మకి తెలుసు)

ఇక్కడ మా అత్త ఇంట్రడక్షన్: మా అత్త గోరింటాకుతో చందమామ పెడితే అది సూర్యుడి లా ఉండేది అయినా సరే గుడ్ గాళ్ పదవి కోసం అత్త దగ్గరికి వెళ్ళి చేతులు రెండూ చాపి అత్తా వాళ్ళెవరూ నన్ను గోరింటాకు పెట్టుకోనివ్వట్లేదు (అబద్ధం)అన్నాను. వెంటనే మా అత్త వచ్చి వాళ్ళెవరు వద్దనటనికి అని నాతో అని, మామయ్యని పిలిచి మహీ చేతిలో ఏమైనా డిజైన్ గీయండి అంది(మామయ్య పెయింటింగ్స్ బాగా వేసేవారు)

మా మామయ్య నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని నా చెయ్యి పట్టుకుని బ్లూ ఇంక్ పెన్నుతో డిజైన్ వేసారు.
అప్పుడు మా అత్త ఒక అగ్గిపుల్ల,బంతి ఆకు,నీళ్ళు,ఒక పాత గుడ్డ లాంటి ఎక్విప్మెంట్తో వచ్చి గోరింటాకు పెట్టటం మొదలుపెట్టింది.నేను అలాగే మామయ్య ఒళ్ళోనే నిద్రపోయాను.గోరింటాకు పెట్టటం అయ్యాక నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి మంచమీద పడుకోబెట్టారు.
నేను నిద్రలేచేసరికి అందరూ చేతులు కడిగేసుకుని చూసుకుంటున్నారు నేను కూడా పరిగెత్తుకుంటు వెళ్ళి చేతులు రెండూ బకెట్ లో ముంచేసాను(అప్పటిలో మా అమ్మ చుట్టుపక్కల లేకపోతే నేను చేతులు అలాగే కడుక్కునేదాన్ని).
ఏదో ఆరెంజ్ కలర్లో ఉన్నాయి నా చేతులు అందరివి ఏమో ఎర్రగా ఉన్నాయి నేను పొద్దున చేద్దామని వదిలేసిన పెంకులు ఎగరగొట్టే పని మొదలుపెట్టాను. ఇంకేముంది అందరూ వచ్చేసారు నా దగ్గరికి అప్పుడు సీన్

నేను:వా(.......
అక్క:మహీ రేపటికి మంచి కలర్ వస్తుంది నాన్నా ఊరుకో

నేను:అప్పుడు మీ అందరీ చేతులు కూడా ఇంకా ఎర్రగా ఔతాయి వా........(డెసిబెల్స్ పెరుగుతాయి)
అక్క:కాదు మా చేతులు నల్లబడిపోతాయి మామయ్య పెయింట్ వేసేప్పుడు చూడలేదూ?

నేను: నాకిప్పుడే కావాలీ ఈ..........
మా కజిన్(ఏడుపు గొంతు తో):ఉండు నేను ఇంక్ కాయలు తెస్తాను
******************************************************************************
అంతే ఇంక్ కాయలు నలిపి నా చేతి మీద డిజైన్ లో ఫిల్ చేసారు ఆ కలర్
అప్పటికే మా బట్టల నిండా మొహాల నిండ కలర్ అంటింది.అందరికంటే ముందు కలర్ అంటిన సంగతి ఇంక్ కాయలు తెచ్చిన మా కజిన్ గుర్తించాడు.అంతే ఈ సారి నాతో పాటు అందరూ ఏడుపు మొదలుపెట్టారు.పక్క ఇంటివాళ్ళ పెంకులు కూడా ఎగిరిపోవటం మొదలయ్యింది.
మా అమ్మమ్మ వెంటనే వచ్చి మా అవతారాలు చూసి అందరికీ బగబగా (గబగబాని చిన్నప్పుడు నేనలాగే అనేదాన్ని) స్నానాలు చేయించింది.

మర్నాడు నిద్రలేచాక చూసుకుంటే నిజంగానే నా చేతులు ఎర్రగా అయినట్టు అనిపించింది మ అక్క,కజిన్ నా కోసం అంత కష్టపడ్డందుకేమో :)

10 comments:

 1. భలే ముచ్చటగా ఉన్నాయి మీ గోరింటాకు కబుర్లు :)

  ReplyDelete
 2. chalaa baga rasaraMdi.maa imtiki kuda veesavi selavalaki maa cousins valla pillalu vacchinappudu ilagee cones to pettukunee vallamu
  :-)

  ReplyDelete
 3. ఆద్యంతమూ ఉల్లాసంగా ఉత్సాహ భరితంగా .. ఎట్సెట్రా ఎట్సెట్రా .. :)

  ReplyDelete
 4. కొంచం ఇంచుమించుగా మా ఇంట్లోనూ ఇదే సీన్ ఉండేది. ఆకు కోసుకొచ్చే డ్యూటీ మాత్రం మగపిల్లలది. 'లేతది కావాలి, కొమ్మలు విరగకూడదు' అని సవాలక్ష ఆంక్షలు. కృష్ణ డాన్స్ చూసి నవ్వకుండా ఉన్నారంటే గుడ్ గర్ల్ అనిపించుకోవడం ఎంత ఇష్టమో అర్ధమైంది :)

  ReplyDelete
 5. @ మధురవాణి::) థాంక్స్

  @ హర్షోల్లాసం: నా చిన్నప్పుడు కోన్స్ గురించి అసలు మాకు తెలియదు :)

  @ చైతన్య.ఎస్: :)

  @ కొత్తపాళీ: :) చాలా థాంక్సండి

  @ మురళి: :)

  @ Dreamer: :)

  ReplyDelete
 6. మీ చిన్నప్పటి విషయాలు బాగా నెరేట్ చేస్తున్నారండి. ఎలాంటి సమయంలో ఐనా మనకు నవ్వు తెప్పించేవి ఇలాంటివే కద

  -కార్తీక్

  ReplyDelete
 7. అంత చిన్న వయసు లో కూడా మంచి పిల్ల అనిపించుకోవడానికి కృష్ణ డాన్సులు చూడకుండా ఎంత కష్ట పడ్డారండి.. నేను కూడా ఒప్పుకుంటున్న మహి చాల మంచి అమ్మాయి..
  అవును..మా తాతయ్య లాగా మీ మావయ్య కూడా గుండు అని పిలుస్తారా మిమ్మల్ని ??

  ReplyDelete