టైం: వేసవి కాలం, 4pm
స్థలం:అమ్మమ్మ వాళ్ల ఊరు
ఆరోజు నా మూడ్ ఏమీ బాలేదు.అమ్మ వాళ్ళ పెళ్ళికి నన్ను పిలవనందుకు అమ్మమ్మ తో గొడవ పెట్టుకుని అలిగాను.(ఎందుకైనా మంచిదని అన్నం తిన్నాక అలిగాను).పైగా ఎండలు అని అబద్ధం చెప్పి (అమ్మమ్మ వాళ్ళ ఊరు నాకెప్పుడూ చల్లగానే ఉంటుంది)నన్ను గది లో నుంచి బయటకి రానివ్వట్లేదు.అందుకే కోపం వచ్చి నా పెళ్ళికి కూడా మిమ్మల్ని ఎవరినీ పిలవను అని చెప్పాను.వెంటనే మా అమ్మ "శ్రీ రామచంద్రా! నాకీ అతి తెలివి కూతురేంటి నాయనా?" అని దేవుడికి ఒక ప్రశ్నాపత్రం పంపించింది (question paper తెలుగులో ఏం అంటారో గుర్తు తెచ్చుకోవటానికి చాలా టైమే పట్టింది)ఫైగా పద కాసేపు పడుకుందువుగాని అని తీసుకెళ్ళిపోయింది.
నాకేమో నిద్ర రాలేదు.సరే ఎలాగూ మెలకువగానే ఉన్నాం కదా అని పెళ్ళి పనుల గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. నాకు అన్నిటికంటే ముందు మామిడాకులు గుర్తువచ్చాయి.ఆ వెంటనే నాకు నేను పెంచుకుంటున్న మామిడి చెట్టు గుర్తువచ్చి చాలా బాధేసింది.అదేమో చాలా చిన్న చెట్టు ఆకులు కొయ్యటం నాకు ఇష్టం లేదు.ఇలా నా టెన్షన్ లో నేనుంటే మా పాలేరు ట్రింగ్..ట్రింగ్ అని cycle మీద వెళుతూ "హేంటి పాపమ్మగారూ హలా కూకున్నారూ?"అని అడిగాడు.
అసలే నా పేరు నాకు చాలా ఇష్టం ఇలా పాపమ్మ,ఆండాళ్ళమ్మ అని పిలిస్తే నాకు ఒళ్ళు మండింది.అయినా ఇతనితో నాకేంటి అనవసరంగా టైం వేస్ట్ అని నా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నా నువ్వెళ్ళు అని చెప్పా.అంతే నేనేదో జోక్ వేసినట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
వెళ్ళేవాడు వెళ్ళకుండా అందరికీ చెప్పేశాడు.ఇహ అందరూ ఒకటే నవ్వటం.ఇది చాలనట్టు నీ పెళ్ళికి సంవత్సరం ముందు నుంచి అరటి ఆకులు కొనాలి భోజనాలకి లేకపోతే సరిపోవు.అలా చేస్తారు మీ నాన్నగారు అని మళ్ళీ నవ్వటం.నాకైతే ఎంత కోపం వచ్చేదో.కాని ఏం చేస్తాం.అప్పటికి నాకు 5 years.ఏమైనా అంటే చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు అంటారని ఊరుకున్నా.
ఇప్పటికీ ఊరు వెళితే అందరూ ఇది గుర్తు తెచ్చుకుని నవ్వుతారు.
నేను కూడా నవ్వుతాను :)
:-)
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteచాలా థాంక్స్ మహి గారు
ReplyDeleteI read this post earlier. I dont know when I visited. It was funny.
ReplyDelete