Sunday, January 25, 2009

నేను

అందరూ రాసేస్తున్నారు కదా అని నేను మొదలుపెట్టాకాని ఏం రాయాలో తెలియట్లేదు.
నేను ఏదో పెద్ద మేధావినని మా ఇంట్లో వాళ్ళందరి ప్రగాఢ విశ్వాసం,మరీ ముఖ్యంగా మా అమ్మమ్మకి,పెద్దమ్మకి.
మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాల కూరగాయల మొక్కలు ఉండేవి. సెలవులకి వెళ్ళినప్పుడల్లా అక్కడ అందరి మీద చాల పెత్తనం చేసేదాన్ని (అందరిమీదా అంటే మా పక్కింట్లో ఉండే చిన్నపిల్లల మీద,మా cousins మీద).

మా అమ్మమ్మ కి కూరగాయలు మొక్కల మీద చాలా శ్రద్ధ ఉండేది. ఒకరోజు మా అమ్మమ్మ పొట్లకాయ పిందెకి దారంతో రాయి కట్టింది అలా కడితే తొందరగా పెరుగుతుంది అని చెప్పింది నాకు.
అసలే తెలివి ఎక్కువేమో (పోస్ట్ స్టార్టింగ్ లోనే ఆ విషయం చెప్పాను గుర్తు తెచ్చుకోండి) నాకు వెంటనే పొట్టిగా ఉండే మా పెద్దమ్మ జుట్టు గుర్తు వచ్చింది. ఆ మద్యానం నిద్రపోతున్నప్పుడు (మెలకువగా ఉన్నప్పుడు నాలా కుదురుగా ఉండేది కాదు) దేవుడికి దణ్ణం పెట్టుకుని ఒక కంకర రాయి కట్టేసాను ఆవిడ జడకి. హమ్మయ్య స్కూల్ లో ప్రిన్సిపాల్ సర్ చెప్పినట్టు ఈ సెలవుల్లో మంచి పని చేసేసినట్టే అనుకున్నా ఎందుకంటే సెలవల తర్వాత పిల్లలందరిని క్లాసు టీచర్స్ అడిగేవారు ఏం చేసారు సెలవుల్లో అని మనం చేసినవి ఎందుకులే చెప్పి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టటం అని నేను ఎప్పుడు ఏమి చెప్పేదాన్ని కాదు.
ఇక ఆ తర్వాత ప్రతి రెండు నిముషాలకి వెళ్లి చెక్ చేయటం మొదలుపెట్టాను ఎమయినా పెరిగిందేమో అని ఏమి లాభం లేదు.అప్పటికే స్కూల్ లో ఏం చెప్పాలో రిహర్సేల్ వేసేసుకున్నాను ఇప్పుడెలాగా అని అలోచించి
సరేలే రాయి బరువు సరిపోలేదేమో అని బయటే ఉన్నా ఇటుక రాయి ట్రై చేద్దాం అనుకున్నా . ఈలోపు మా పెద్దమ్మ లేచి వచ్చింది చేతిలో మామిడికాయ రసం గ్లాస్ తో.అది చూసన వెంటనే చేతిలో ఉన్నా రాయి వదిలెయ్యటం అది నా కాలి వేలి మీద పడి దెబ్బ తగలటం అన్ని వెంటవెంటనే జరిగిపొయాయి.

అలా నా లైఫ్ లో నేను చేద్దాం అనుకున్న మంచి పని మద్యలో ఆగిపొయింది.
కాని నన్ను మ పెద్దమ్మ అర్థం చేసుకుని ఏమి అనలేదు.మన politicians కి కూడ ఇలాగే ఏవో అడ్డంకులు మంచి పనులు చెయ్యటానికి కాని వాళ్ళని ఎవరూ అర్థం చేసుకోరు .పాపం.

6 comments:

 1. chaala rojula tarvata oka blog chusi manasara navvukunna...:) :) :)
  eevidagarini....AP16 ani...antuntaru maa college lo..adenandi bezawada registration number.. Chaaala pedda topper andi..evida. pettanam cheyadamlo mundu..
  edina gani manchi haaasyam to rasav mahitha.. keep it up...

  ReplyDelete
 2. Aboooo keeeeekaaa, Tooo intelligent. Great blog!!!! Andukey Eamcet antaaruuu,,, AP16 zindabad......

  ReplyDelete
 3. హహ్హహ్హ బాగుంది మీ తెలివి... :)
  బాగా నవ్వించారు.
  reminds me of the line "I am born Intelligent" :P

  ReplyDelete
 4. నేను పుట్టగానే చాలా ఆశ్చర్యపోయానంట. ఆ ఆశ్చర్యం లో నుంచి తేరుకోవటానికి నాకు 18 మంత్స్ పట్టిందంట.

  అప్పటివరకు నేను చేసిన పనుల లిస్ట్ (అంటే పుట్టినదగ్గరనుంచి మాటలు వచ్చేవరకు)

  వెన్నెల మెట్లెక్కి వెండి జాబిల్లి అందుకోవటం
  మంచు పూలు ఏరుకోవటం
  సన్నజాజి నవ్వులు చూడటం

  చూసారా నేను చిన్నప్పటినుంచి ఎంత Hardwork చేసేదాన్నో
  choochaam mahi gaaru mee hardwork chaala bavundhi

  ReplyDelete
 5. మీరు బాగా రాశారండి.

  ReplyDelete