Thursday, January 29, 2009

నేను-మా పాలేరు

టైం: వేసవి కాలం, 4pm
స్థలం:అమ్మమ్మ వాళ్ల ఊరు


ఆరోజు నా మూడ్ ఏమీ బాలేదు.అమ్మ వాళ్ళ పెళ్ళికి నన్ను పిలవనందుకు అమ్మమ్మ తో గొడవ పెట్టుకుని అలిగాను.(ఎందుకైనా మంచిదని అన్నం తిన్నాక అలిగాను).పైగా ఎండలు అని అబద్ధం చెప్పి (అమ్మమ్మ వాళ్ళ ఊరు నాకెప్పుడూ చల్లగానే ఉంటుంది)నన్ను గది లో నుంచి బయటకి రానివ్వట్లేదు.అందుకే కోపం వచ్చి నా పెళ్ళికి కూడా మిమ్మల్ని ఎవరినీ పిలవను అని చెప్పాను.వెంటనే మా అమ్మ "శ్రీ రామచంద్రా! నాకీ అతి తెలివి కూతురేంటి నాయనా?" అని దేవుడికి ఒక ప్రశ్నాపత్రం పంపించింది (question paper తెలుగులో ఏం అంటారో గుర్తు తెచ్చుకోవటానికి చాలా టైమే పట్టింది)ఫైగా పద కాసేపు పడుకుందువుగాని అని తీసుకెళ్ళిపోయింది.


నాకేమో నిద్ర రాలేదు.సరే ఎలాగూ మెలకువగానే ఉన్నాం కదా అని పెళ్ళి పనుల గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. నాకు అన్నిటికంటే ముందు మామిడాకులు గుర్తువచ్చాయి.ఆ వెంటనే నాకు నేను పెంచుకుంటున్న మామిడి చెట్టు గుర్తువచ్చి చాలా బాధేసింది.అదేమో చాలా చిన్న చెట్టు ఆకులు కొయ్యటం నాకు ఇష్టం లేదు.ఇలా నా టెన్షన్ లో నేనుంటే మా పాలేరు ట్రింగ్..ట్రింగ్ అని cycle మీద వెళుతూ "హేంటి పాపమ్మగారూ హలా కూకున్నారూ?"అని అడిగాడు.
అసలే నా పేరు నాకు చాలా ఇష్టం ఇలా పాపమ్మ,ఆండాళ్ళమ్మ అని పిలిస్తే నాకు ఒళ్ళు మండింది.అయినా ఇతనితో నాకేంటి అనవసరంగా టైం వేస్ట్ అని నా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నా నువ్వెళ్ళు అని చెప్పా.అంతే నేనేదో జోక్ వేసినట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

వెళ్ళేవాడు వెళ్ళకుండా అందరికీ చెప్పేశాడు.ఇహ అందరూ ఒకటే నవ్వటం.ఇది చాలనట్టు నీ పెళ్ళికి సంవత్సరం ముందు నుంచి అరటి ఆకులు కొనాలి భోజనాలకి లేకపోతే సరిపోవు.అలా చేస్తారు మీ నాన్నగారు అని మళ్ళీ నవ్వటం.నాకైతే ఎంత కోపం వచ్చేదో.కాని ఏం చేస్తాం.అప్పటికి నాకు 5 years.ఏమైనా అంటే చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు అంటారని ఊరుకున్నా.

ఇప్పటికీ ఊరు వెళితే అందరూ ఇది గుర్తు తెచ్చుకుని నవ్వుతారు.

నేను కూడా నవ్వుతాను :)

Wednesday, January 28, 2009

వాణి ఆంటీ

నా చిన్నప్పుడు మేము కోడూరు లో ఉండేవాళ్ళం.నాకు కర్రెక్ట్గా గుర్తులేదు ఆ ఊరి పేరు. అక్కడ ఏవో మైన్స్ ఉండేవి. మా ఇంటికి దగ్గర్లోనే వాణి అంటి వాళ్ళు ఉండేవారు.వాళ్ళది కూడా విజయవాడే. ఆటోమేటిక్గా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు.వాళ్ళకి పిల్లలు లేరు.నన్ను చాలా బాగా చూసేవారు. ఆంటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవారు.నా Birthday కి ఆంటి కొబ్బరి పాల తో స్వీట్ చేసేవారు. అంత టేస్టీగా ఉండే స్వీట్ ఇంతవరకు తినలేదు నేను. మేము ఆ ఊరు నుంచి 2 Years తర్వాత వచ్చేసాం.తర్వాత ఆంటీ వాళ్ళు కూడా విజయవాడ వచ్చేసారు .నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళి 10 Days ఉంచుకున్నారు.తర్వాత వాళ్ళు ఏదో ఊరు వెళ్ళిపోయారు నేను కూడా మర్చిపోయాను.చాలా రోజుల తర్వత ఒకసారి ఎవరో కామన్ ఫ్రెండ్స్ కనిపించి ఆంటీ కి ఒక పాప,బాబు పుట్టారని చెప్పారు.

ఒకసారి అంకుల్ వాళ్ళ తమ్ముడు కనిపించి మా నాన్నగారి దగ్గర నుంచి contact నెంబర్ తీసుకున్నారంట. కాని మా పనుల్లో మేముండి కాల్ చెయ్యలేకపోయాము.

రీసెంట్గా అంకుల్ కాల్ చేసి చెప్పారంట వాణి చచ్చిపోయి వచ్చే వారానికి 1 year ఔతుంది.విజయవాడ లోనే చేస్తున్నాం ceremony రండి అని.
నేను అప్పుడు పుణేలోనే ఉన్నాను. అమ్మ చెప్పింది పాప ఆంటీ Xerox copy లా ఉంది అని.
అంకుల్ అమ్మ వాళ్ళని ఆ పిల్లలకి మహితక్క వాళ్ళ పేరెంట్స్ అని introduce చేసారంట.ఆ పిల్లలేమో అక్క ఏది అని అడిగారంట. వాళ్ళు అల్లరి చేసినప్పుడల్ల మహితక్క గురించి చెప్తాను రండి అనే వారంట ఆంటీ.
అమ్మ చెప్పింది ఆంటి మొత్తం లైఫ్ లో ఎప్పుడూ సంతోషంగా లేరు అని ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా. కొవ్వొత్తి చీరకి అంటుకుని 80% బర్న్స్ తో చనిపోయారంట.ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతున్నారు అనుకునే లోపే అంతా అయిపోయింది.
నన్ను అంతలా గుర్తుపెట్టుకున్న ఆంటీ ని ఒక్కసారి కూడా చూడలేకపోయాను. ఇంకెప్పుడూ కనపడరు కూడా. చాలా మందికి ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి పనుల్లో మనమే పట్టించుకోము. ఇవాళ ఎందుకో ఆంటీ బాగా గుర్తువస్తున్నారు. భ్లాగ్లో రాయలనిపించి రాస్తున్నా.

Hardwork

నేను పుట్టగానే చాలా ఆశ్చర్యపోయానంట. ఆ ఆశ్చర్యం లో నుంచి తేరుకోవటానికి నాకు 18 మంత్స్ పట్టిందంట.

అప్పటివరకు నేను చేసిన పనుల లిస్ట్ (అంటే పుట్టినదగ్గరనుంచి మాటలు వచ్చేవరకు)

వెన్నెల మెట్లెక్కి వెండి జాబిల్లి అందుకోవటం
మంచు పూలు ఏరుకోవటం
సన్నజాజి నవ్వులు చూడటం

చూసారా నేను చిన్నప్పటినుంచి ఎంత Hardwork చేసేదాన్నో

:)

Sunday, January 25, 2009

నేను

అందరూ రాసేస్తున్నారు కదా అని నేను మొదలుపెట్టాకాని ఏం రాయాలో తెలియట్లేదు.
నేను ఏదో పెద్ద మేధావినని మా ఇంట్లో వాళ్ళందరి ప్రగాఢ విశ్వాసం,మరీ ముఖ్యంగా మా అమ్మమ్మకి,పెద్దమ్మకి.
మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాల కూరగాయల మొక్కలు ఉండేవి. సెలవులకి వెళ్ళినప్పుడల్లా అక్కడ అందరి మీద చాల పెత్తనం చేసేదాన్ని (అందరిమీదా అంటే మా పక్కింట్లో ఉండే చిన్నపిల్లల మీద,మా cousins మీద).

మా అమ్మమ్మ కి కూరగాయలు మొక్కల మీద చాలా శ్రద్ధ ఉండేది. ఒకరోజు మా అమ్మమ్మ పొట్లకాయ పిందెకి దారంతో రాయి కట్టింది అలా కడితే తొందరగా పెరుగుతుంది అని చెప్పింది నాకు.
అసలే తెలివి ఎక్కువేమో (పోస్ట్ స్టార్టింగ్ లోనే ఆ విషయం చెప్పాను గుర్తు తెచ్చుకోండి) నాకు వెంటనే పొట్టిగా ఉండే మా పెద్దమ్మ జుట్టు గుర్తు వచ్చింది. ఆ మద్యానం నిద్రపోతున్నప్పుడు (మెలకువగా ఉన్నప్పుడు నాలా కుదురుగా ఉండేది కాదు) దేవుడికి దణ్ణం పెట్టుకుని ఒక కంకర రాయి కట్టేసాను ఆవిడ జడకి. హమ్మయ్య స్కూల్ లో ప్రిన్సిపాల్ సర్ చెప్పినట్టు ఈ సెలవుల్లో మంచి పని చేసేసినట్టే అనుకున్నా ఎందుకంటే సెలవల తర్వాత పిల్లలందరిని క్లాసు టీచర్స్ అడిగేవారు ఏం చేసారు సెలవుల్లో అని మనం చేసినవి ఎందుకులే చెప్పి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టటం అని నేను ఎప్పుడు ఏమి చెప్పేదాన్ని కాదు.
ఇక ఆ తర్వాత ప్రతి రెండు నిముషాలకి వెళ్లి చెక్ చేయటం మొదలుపెట్టాను ఎమయినా పెరిగిందేమో అని ఏమి లాభం లేదు.అప్పటికే స్కూల్ లో ఏం చెప్పాలో రిహర్సేల్ వేసేసుకున్నాను ఇప్పుడెలాగా అని అలోచించి
సరేలే రాయి బరువు సరిపోలేదేమో అని బయటే ఉన్నా ఇటుక రాయి ట్రై చేద్దాం అనుకున్నా . ఈలోపు మా పెద్దమ్మ లేచి వచ్చింది చేతిలో మామిడికాయ రసం గ్లాస్ తో.అది చూసన వెంటనే చేతిలో ఉన్నా రాయి వదిలెయ్యటం అది నా కాలి వేలి మీద పడి దెబ్బ తగలటం అన్ని వెంటవెంటనే జరిగిపొయాయి.

అలా నా లైఫ్ లో నేను చేద్దాం అనుకున్న మంచి పని మద్యలో ఆగిపొయింది.
కాని నన్ను మ పెద్దమ్మ అర్థం చేసుకుని ఏమి అనలేదు.మన politicians కి కూడ ఇలాగే ఏవో అడ్డంకులు మంచి పనులు చెయ్యటానికి కాని వాళ్ళని ఎవరూ అర్థం చేసుకోరు .పాపం.